ఒకరోజు జరిగిన అనుకోని సంఘటనతో ఆరుగురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే అంశాన్ని చర్చిస్తూ రూపొందించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకుడు. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనెపూడి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను హీరో శర్వానంద్ విడుదల చేశారు. ‘చెప్పుకోవడానికి ఇది మామూలు కథ కాదు.
అండపిండ బ్రహ్మాండాలను కూడా అల్లాడించే కథ’ అనే డైలాగ్‌తో టీజర్ ఇంట్రెస్టింగ్గా మొదలైంది. ఓ బాక్స్, గన్ చుట్టూ ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్ సాగింది. తుపాకీ కోసం మాఫియా డాన్ ఎందుకు వెతుకుతున్నాడనే విషయం సస్పెన్స్‌ను పంచింది. న్యూఏజ్ క్రైమ్ కామెడీ చిత్రమిదని దర్శకుడు తెలిపారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, కార్తికేయ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అజయ్ అబ్రహం జార్జ్, సంగీతం: స్టీఫెన్, ఆనంద్, దర్శకత్వం: గుణి మంచికంటి.