టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సిద్దార్థ్‌తో కలిసి నటిస్తోన్న మహాసముద్రం షూటింగ్ పూర్తి చేసుకోగా..మరో చిత్రం ఒకే ఒక జీవితం విడుదలకు రెడీ అవుతోంది. ఇవేకాకుండా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తోన్న మరో చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు షురూ అయింది. మొదటి రోజు షూట్లో శర్వానంద్, రష్మిక టీంతో కలిసి జాయిన్ అయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన స్టిల్ ను మేకర్స్ షేర్ చేయగా..ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ కిశోర్ తిరుమల హీరో శర్వానంద్, రష్మిక తో కలిసి లొకేషన్ లోని మానిటర్ లో సీన్ ను చెక్ చేస్తుండటం ఫొటోలో చూడొచ్చు.
The most refreshing combo of @ImSharwanand & @iamRashmika's #AadavaalluMeekuJohaarlu Shoot begins 🎬
— BA Raju's Team (@baraju_SuperHit) July 20, 2021
More exciting updates soon @DirKishoreOffl @sujithsarang @SLVCinemasOffl pic.twitter.com/5XGvDoFstx
ఇవి కూడా చదవండి..
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?