హీరో శర్వానంద్ ప్రస్తుతం తన 36వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘బైకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.
ఇందులో శర్వానంద్ స్పోర్ట్స్ బైక్‌పై రైడింగ్ గేర్ డ్రెస్ ధరించి కనిపిస్తున్నారు. 1990-2000 నేపథ్యంలో నడిచే కథ ఇదని, ఓ యువకుడి రేసింగ్ డ్రీమ్స్‌ని ఆవిష్కరిస్తూ ఫ్యామిలీ డ్రామాగా మెప్పిస్తుందని, తెలుగులో రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సరికొత్త కథాంశమిదని మేకర్స్ తెలిపారు. మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: వంశీ-ప్రమోద్, రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి.