Sharwanand | యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త సినిమా ‘బైకర్’ కోసం అద్భుతమైన మేకోవర్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంలో ఆయన యువ బైక్ రేసర్‌గా కనిపించబోతున్నారు. ఇందుకోసం ఆయన తన కెరీర్లో తొలిసారి సిక్స్‌ప్యాక్ లుక్ లో దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి శర్వా అభిమానుల్లో హల్చల్ సృష్టిస్తున్నాయి. అయితే ఈ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న కష్టాన్ని శర్వానంద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘96’ సినిమా షూటింగ్ సమయంలో షోల్డర్ ఇంజ్యూరీ కారణంగా ఆయనకు సర్జరీ జరగడం, దీని వలన కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి రావడం వల్ల బరువు పెరిగి 90 కేజీలకు చేరుకున్నాను అని చెప్పారు.
ఆ సమయంలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఆహారం ఎక్కువ తినడం వలన బరువు అదుపులో లేకుండా పెరిగిపోయింది అని ఆయన తెలిపారు. రెండేళ్ల క్రితం ‘బైకర్’ ఆఫర్ వచ్చినప్పుడు, అందులో 18 ఏళ్ల యువకుడి పాత్ర చేయాల్సి రావడంతో బరువు తగ్గక తప్పలేదని చెప్పారు. “అప్పుడు నేను ఫిట్‌గా కనపడకపోతే ఆ రోల్‌కి న్యాయం చేయలేను. అందుకే సవాల్‌గా తీసుకున్నాను అని అన్నారు. ఇక శర్వానంద్ తన వర్కౌట్ రొటీన్ గురించి చెబుతూ, “ప్రతి రోజు తెల్లవారు జామున 4.30 గంటలకు లేచేవాడిని. కేబీఆర్ పార్క్‌లో రన్నింగ్ చేసి, వెంటనే జిమ్‌కి వెళ్ళేవాడిని. ఇలా ఎనిమిది నెలలపాటు విరామం లేకుండా కష్టపడ్డాను . అలా చేయడం వల్ల నా ఓపిక పెరిగింది, ఫోకస్ కూడా మెరుగుపడింది అని తెలిపారు.
తన జీవితంలో మరో పెద్ద మలుపు కూతురు పుట్టడం అని శర్వా చెప్పారు. “కూతురు పుట్టాక నా ఆలోచనా విధానం మారిపోయింది. ఫిట్నెస్ అనేది కేవలం సినిమాల కోసమే కాదు, ఫ్యామిలీ కోసం కూడా అవసరమని అర్థం అయింది అని అన్నారు. ఆహారం విషయంలోనూ ఆయన కఠిన నియమాలు పాటించినట్లు తెలిపారు. “నేను ఫుడీని కానీ ఇకపై కావలసినంత మాత్రమే తినాలి అని నిర్ణయించుకున్నాను. ఫిట్‌నెస్‌లో 70 శాతం మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది, 30 శాతం మాత్రమే వర్కౌట్స్ పై ఉంటుంది అని అన్నారు. ఈ క్రమంలో శర్వానంద్ రెండు సంవత్సరాల్లో 22 కిలోల బరువు తగ్గి , అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ సాధించారు. “ప్రతి నెలా ఒక కేజీ చొప్పున తగ్గుతూ వచ్చాను” అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ‘బైకర్’ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ దశలో ఉంది. యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శర్వా కొత్త లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మైమరిచేలా ఉండనున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.