Sharvari Wagh | బాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి కథానాయికగా రాణిస్తున్నది శార్వరి వాఘ్. ‘బంటీ ఔర్ బబ్లీ 2’ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ భామ యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిస్తున్న ‘అల్ఫా’ చిత్రంలో కీలకపాత్రను పోషించనుంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ స్పై చిత్రమిదే కావడం విశేషం. ఇందులో అలియాభట్ లీడ్ రోల్‌ని పోషిస్తున్నది.
ఇప్పటికే ఆమె షూటింగ్లో పాల్గొంటున్నది. ‘అల్ఫా’ చిత్రంలో శార్వరి వాఘ్ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని, యాక్షన్ ప్రధానంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా కోసం శార్వరి వాఘ్ ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నది. ఫిజికల్‌గా మరింత ఫిట్‌గా కనిపించేందుకు కసరత్తులు చేస్తున్నది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ఆమె ‘అల్ఫా’ షూటింగ్లో పాల్గొనబోతున్నది. ఆదిత్యచోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.