ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న కొడుకు ఆర్యన్‌ఖాన్( Aryan Khan )ను కలిశాడు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్. ఈ నెల 3 ఆర్యన్ అరెస్ట్ తర్వాత షారుక్ అతన్ని కలవడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ కేసులో ప్రత్యేక కోర్టు రెండుసార్లు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. గత వారం షారుక్‌తోపాటు అతని భార్య గౌరీ ఖాన్ జైల్లో ఉన్న ఆర్యన్‌తో వీడియో కాల్లో మాట్లాడారు. ఆర్యన్‌కు కోర్టు విచారణల్లో షారుక్ మేనేజర్ పూజా దద్లానీ, వాళ్ల లీగల్ టీమ్ సాయం చేస్తోంది. కొవిడ్-19 కారణంగా కొన్నాళ్లుగా జైల్లో సందర్శకులను అనుమతించని మహారాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా వాటిని సడలించింది. ఖైదీలను ఇద్దరు కుటుంబ సభ్యులు కలవచ్చని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ వెంటనే షారుక్ నేరుగా వెళ్లి ఆర్యన్‌ను కలిశాడు.
#WATCH Shah Rukh Khan leaves from Mumbai's Arthur Road Jail after a brief meeting with son Aryan pic.twitter.com/A9y2exXtn4
— ANI (@ANI) October 21, 2021