బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో కెప్టెన్సీకి పోటీపడేందుకు అర్హత సాధించిన సంతోషంలో బ్లూ టీమ్‌లోని మానస్ యానీ మాస్టర్‌ను ఎత్తుకుని తిప్పాడు. అనంతరం కాజల్.. ప్రియాంకతో మాట్లాడుతూ.. నీకు నీ మీద ప్రేమ కన్నా కూడా మానస్ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుంది అని చెప్పగా, నేనేమైన తప్పు చేస్తున్నానా అని అడిగింది పింకీ. దీనికి కాజల్ తప్పేం కాదన్నట్టు చెప్పుకొచ్చింది.
ఇక జెస్సీ.. ప్రియాంకకు సలహాలు ఇస్తుండగా, అలా ఇవ్వోద్దని షణ్ముఖ్ అన్నాడు. ఇది షణ్ముఖ్‌కి, జెస్సీ ఇద్దరికి వర్తింపజేస్తుందని కౌంటర్ వేసింది సిరి. దీనికి ఈ పుడుంగి పెద్ద చెప్పడానికి వచ్చిందంటూ సిరిపై మండిపడ్డాడు.దీంతో ఆమె అక్కడ నుండి వెళ్లిపోయింది. కొద్ది సేపటి తర్వాత షణ్ముఖ్ వెళ్లి ఆమె కోపాన్ని చల్లార్చాడు.
ఇక సన్నీ వల్ల మానస్ లాభపడుతున్నాడని అభిప్రాయపడ్డాడు షణ్ను. మానస్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని పేర్కొన్నాడు.మరోవైపు కాజల్.. నీ కోసం ముగ్గురు కొట్టుకుంటున్నారని మానస్‌తో ముచ్చట్లు పెట్టింది. పింకీతోపాటు ప్రియ నీ విషయంలో పొసెసివ్ అనిపిస్తుందని చెప్పుకొచ్చింది, కానీ మూడో వ్యక్తి ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.