విజయవంతమైన ‘శంబాల’ చిత్రాన్ని నిర్మించిన మహిధర్‌రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు.. ఓ భారీ పానిండియా సోషియో ఫాంటసీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ‘శంబాల’ దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తారు. సందీప్‌కిషన్ కథానాయకుడు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ని వదిలారు. యుద్ధభూమి నేపథ్యంలో ఓ సింహం, తోడేలు.. వాటిమధ్య ఒక పురాతన ఖడ్గం.. ఈ పోస్టర్లో చూడొచ్చు.
‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు.. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు..’అనే క్యాప్షన్ చూస్తే.. ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ద్వారా ఆడియన్స్‌ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇదని అర్థమవుతున్నది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలపెడతామని మేకర్స్ తెలిపారు.