ఇండియాలో అత్యధికంగా సంపాదిస్తున్న యాక్టర్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటాడు షాహిద్‌కపూర్. తనకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని పద్దతిగా నచ్చిన ఇంటి కోసం వెచ్చిస్తున్నాడు షాహిద్‌కపూర్. ముంబైలోని వోర్లి ఏరియాలో షాహిద్‌కపూర్ రూ.56 కోట్లతో అపార్టుమెంట్ కొనుగోలు చేశాడని బీటౌన్ టాక్. షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్‌తో కలిసి ఇంటిని డిజైన్ చేసుకున్నాడట. అపార్టుమెంట్లో 42, 43వ అంతస్థులో ఉన్న ఇంటికి 360 వెస్ట్ అని పేరు పెట్టాడు.
ఈ ఇంటిలో ఆరు కార్లు పార్కు చేసుకునే సదుపాయం ఉండటమే కాకుండా సీ ఫేస్ లో ఉంటుంది. ఆసక్తికర విషయమేంటంటే షాహిద్ డిజైన్ చేయించుకున్న ఈ రెండు ఫ్లోర్లు బాలీవుడ్ స్టార్లు అక్షయ్‌కుమార్-ట్వింకిల్ ఖన్నా, అభిషేక్-ఐశ్వర్య ఇంటికి సమీపంలోనే ఉంటాయి. ఇటీవలే షాహిద్, మీరారాజ్‌పుత్, ఇషాన్ ఖట్టర్ కొత్తింటిని సందర్శించారు. ప్రస్తుతం జుహూలోని సీ ఫేసింగ్ డూప్లెక్స్ ఫ్లాట్ లో ఉంటున్నాడు షాహిద్. ఇది కూడా షాహిద్ కపూర్ సొంతిళ్లే. ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు షాహిద్.
ఇవి కూడా చదవండి..
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్