షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 18రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్ల వసూళ్లను సాధించి కొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాతో ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల కలెక్షన్స్ దాటిన చిత్రాల్లో నటించిన ఏకైక భారతీయ హీరోగా షారుఖ్‌ఖాన్ అరుదైన రికార్డును సృష్టించారు.
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన షారుఖ్‌ఖాన్ ‘పఠాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యికోట్ల మైలురాయిని దాటింది. తాజాగా ‘జవాన్’తో ఆయన ఆ ఫీట్‌ను పునరావృతం చేశారు. భవిష్యత్తులో ఏ హీరో అయినా ఈ రికార్డును అధిగమించాలంటే అంత సులభం కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు 300కోట్ల వ్యయంతో రూపొందించిన ‘జవాన్’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. ప్రస్తుతం రాజ్‌కుమార్ హీరానీ దర్శకత్వంలో షారుఖ్ ‘డంకీ’ చిత్రంలో నటిస్తున్నారు.