న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్(Shah Rukh Khan).. కంటి సర్జరీ కోసం అమెరికా వెళ్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో డీహైడ్రేషన్ వల్ల షారూక్‌కు హార్ట్స్ట్రోక్ వచ్చిన విషయం తెలిసిందే. కోలుకున్న తర్వాత ఆయన ఐపీఎల్ ఫైనల్‌ను కూడా వీక్షించాడు. ఈ ఏడాది టోర్నీలో.. షారూక్ ఫ్రాంచైజీ కేకేఆర్ టైటిల్‌ను గెలుచుకున్నది. షారూక్ ఎటువంటి కంటి సమస్యతో బాధపడుతున్నాడన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. ఆగస్టు 7 నుంచి జరగనున్న లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో పార్డో అలా కెరీరా అవార్డును అందుకోనున్నారు. గత ఏడాది షారూక్ ఫిల్మ్స్ అన్నీ దాదాపు హిట్ అయ్యాయి. పఠాన్, జవాన్ చిత్రాలు హిట్ కాగా, డుంకి ఫిల్మ్స్‌కు మంచి రివ్వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఆయన కింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.