Pahalgam Terror Attack | జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మంగళవారం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యటకులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిని సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎక్స్ వేదికగా స్పందించాడు.
పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి ఘటనపై ఉన్న బాధను, కోపాన్ని ఈ ఘటనను మాటల్లో వ్యక్తపరచడం కష్టం. ఇలాంటి సమయంలో, దేవుడి వైపు తిరిగి, బాధిత కుటుంబాల కోసం ప్రార్థన చేయడం తప్ప వేరే దిక్కు లేదు. ఈ దుర్ఘటనలో బాధితులైన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మనమందరం ఒక దేశంగా ఐక్యంగా, బలంగా నిలబడి ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారికి న్యాయం జరిగేలా చూద్దామంటూ షారుక్ రాసుకోచ్చాడు.
Words fail to express the sadness and anger at the treachery and inhumane act of violence that has occurred in Pahalgam. In times like these, one can only turn to God and say a prayer for the families that suffered and express my deepest condolences. May we as a Nation, stand…
— Shah Rukh Khan (@iamsrk) April 23, 2025