బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్‌ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్ఏంజిల్స్లో జరుగుతున్న తాజా సినిమా షూటింగ్లో యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ సందర్భంగా ఆయన గాయపడ్డారని తెలిసింది. ప్రమాదం కారణంగా ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆయన్ని సమీప ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు సమాచారం.
ఈ సంఘటన కొద్ది రోజుల క్రితమే జరిగిందని, ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ ముంబయిలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. షారుఖ్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘జవాన్’ సెప్టెంబర్ 7న విడుదలకానుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రాజ్‌కుమార్ హీరాణీ దర్శకత్వంలో ‘డంకీ’ చిత్రంలో నటిస్తున్నారు