షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జవాన్’. అట్లీ దర్శకుడు. నయనతార నాయిక. మరో కీలక పాత్రలో దీపికా పడుకోన్ కనిపించనుంది. టాకీ పార్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం రెండు పాటల చిత్రీకరణకు సిద్ధమవుతున్నది. ఒక పాటను ముంబైలోని పలు అందమైన లొకేషన్స్‌లో నయనతార, షారుఖ్ కాంబినేషన్లో ఈ వారంలో పిక్చరైజ్ చేయబోతున్నారు.
ఈ పాట కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ ఛాట్ బస్టర్ ట్యూన్ ఇచ్చాడని చిత్రబృందం చెబుతున్నది. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుందట. ఇక రెండో పాటను వచ్చే వారంలో దీపికా పడుకోన్, షారుఖ్ కాంబినేషన్లో తెరకెక్కించబోతున్నారు. ఈ రెండు పాటల షూటింగ్‌తో మొత్తం సినిమా పూర్తికానుంది. జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.