Shah Rukh Khan | ఇండియన్ మూవీ లవర్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం డంకీ (Dunki). ఈ చిత్రానికి బాలీవుడ్ (Bollywood) స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వం వహిస్తున్నాడు. ఢిల్లీ భామ తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. డంకీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటరల్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది షారుఖ్‌ఖాన్ టీం. విడుదలకు ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది డంకీ.
డంకీ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాండ్‌గా లాంఛ్ అయ్యాయి. నేషనల్ చైన్స్‌లో మధ్యాహ్నం 12 గంటల వరకు 25500 టిక్కెట్లను Dunki టీం విక్రయించింది. సౌత్ మార్కెట్, ప్రధాన పట్టణాల్లో భారీగా అడ్వాన్స్ సేల్స్ షురూ అయ్యాయి. టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ సందర్భంగా షారుఖ్ ఖాన్ వారియర్ టీం ముంబైలోని మన్నత్ (షారుఖ్‌ఖాన్ నివాసం) బయట టపాకాయలు పేల్చారు. ఇక అంధేరీ, సినీపోలీస్ ప్రాంగణంలో షారుఖ్‌ఖాన్ టీం JoinSRKUniverseతో కలిసి జాయిన్ అయ్యారు. మరోసారి ఓవర్సీస్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్‌తో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వీడియోలతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ క్రేజ ఎలా ఉందో మరోసారి అర్థం చేసుకోవచ్చు.
డంకీ చిత్రంలో బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే Dunki Drop 1, Dunki Drop 2, Dunki Drop 3, Dunki Drop 4, Dunki Drop 5 అంటూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో అభిమానులను ఖుషీ చేస్తోంది షారుఖ్ ఖాన్ టీం.
డంకీని ప్రమోషన్స్‌లో భాగంగా షారుఖ్‌ఖాన్ దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్‌లో సందడి చేయబోతున్నాడని తెలిసిందే. డిసెంబర్ 17 (నేడు)న రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గ్లోబల్ విలేజ్‌లో షారుఖ్‌ఖాన్ టీం సందడి చేయనుంది.
ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫాపై Dunki Drop 4ను స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అభిజాత్ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్ కథనందిస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ సందడి ఇలా..
Team SRK Warriors Mumbai celebrated advance booking launch of Dunki with fire crackers outside Mannat ❤️
The Dunki fever is on fire! 🔥🎟️#ShahRukhKhan @iamsrk #Dunki #OMaahi
— Javed (Fan) (@JoySRKian_2) December 17, 2023
#Mumbai‘s SRKians cheering with joy outside Cinepolis, Andheri! 😍
DM @pradhananshul41 to join our Mumbai team & @JoinSRKUniverse for rest of the cities ✨#DunkiFirstDayFirstShow #Dunki #ShahRukhKhan
— The unrealistic Guy (@GuyUnrealistic) December 17, 2023
🎬 Dunki is calling! Be the first to dunk into the excitement 🔥 Advance bookings are live – snag your tickets now and join the cinematic party with your loved ones ❤️ Don’t miss the dunkin’ good times at a cinema near you!@iamsrk @RedChilliesEnt @RajKumaarHirani #DunkiDrop5… pic.twitter.com/eSvO8pDhYm
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) December 16, 2023
#Dunki has sold 25500 Tickets at National Chains till 12 PM.
BRILLIANT START
South Market & Mass Territories advance has started to open, will see big escalation in bookings now. #ShahRukhKhan pic.twitter.com/3it4Arag9m
— Sumit Kadel (@SumitkadeI) December 17, 2023