Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజారాధన కలిగి ఉన్న నటులలో షారుఖ్ ఒకడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మధ్య కాస్త డల్ అయినట్లు కనిపించినా.. ‘పఠాన్’తో మునపటి షారుఖ్‌ను చూడబోతున్నట్లు పోస్టర్లు, ట్రైలర్లు చూస్తే తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా షారుఖ్ ఓ అరుదైన ఘనత సాధించాడు.
తాజాగా వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రపంచంలో అత్యంత సంపన్నులైన నటుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో షారుఖ్ నాలుగో స్థానంలో నిలిచి అరుదైన ఘనత సాధించాడు. షారుఖ్ ఆస్తుల విలువ $770 మిలియన్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.6వేల కోట్లుకు పైమాటే. ఆస్తులు విలువలో షారుక్ పలువురు హాలీవుడ్ హీరోలను కూడా వెనక్కు నెట్టేశాడు. టామ్‌క్రూయిజ్, జాకీచాన్ వంటి దిగ్గజ హాలీవుడ్ నటులను షారక్ వెనక్కు నెట్టి ముందు స్థానంలోకి వచ్చాడు. ఇక ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ జెర్రీ సైన్ఫీల్డ్ $1 (8 వేల కోట్లకు పైన)తో మొదటి స్థానంలో నిలిచాడు. ఇక ఈ లిస్ట్‌లో ఇండియా నుండి స్థానం సంపాదించుకున్న నటులలో షారుఖ్‌ఖాన్ మాత్రమే ఉన్నాడు.
‘జీరో’ సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ‘పఠాన్’తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు షారుఖ్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా యష్‌రాజ్ ఫిలింస్‌లో బ్యానర్లో 50వ చిత్రం కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.