Shah Rukh Khan- Atlee Movie | తమిళ దర్శకుడు అట్లీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ దగ్గర శిష్యరికం గావించి మొదటి సినిమా ‘రాజారాణి’కి ఆయన్నే నిర్మాతగా పెట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌ను కొట్టాడు. ఆ తరువాత వరుసగా విజయ్‌తో ‘పోలీసోడు’, ‘అదిరింది’, ‘విజిల్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో కోలీవుడ్ అగ్ర దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అట్లీ నుంచి సినిమా వచ్చి మూడేళ్ళయింది. ఈ క్రమంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రానికి ‘జవాన్’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్లో షారుఖ్ మొహం చుట్టూ పట్టి కట్టుకుని ఒంటి నిండా గాయాలతో.. ఒక డెన్‌లో చూట్టు గన్స్‌తో ఉన్న టీజర్ ఆసక్తి రేకెత్తిస్తుంది. షారుఖ్ ఇప్పటివరకు చేయలేని పాత్రలో నటించనున్నట్లు టైటిల్ టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 2న విడుదల చేయబోతున్నట్లు టీజర్లో వెల్లడించారు. ఈ చిత్రంలో షారుఖ్ తండ్రి, కొడుకుగా డ్యూయల్ రోల్లో నటించనున్నాడు. నయనతార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్‌గా నటించనుంది. బాలీవుడ్ భామ సాన్య మల్హోత్రా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుఖ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
షారుఖ్ లేటెస్ట్గా నటించిన ‘పఠాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. దీనితో పాటు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ‘డంకి’ సినిమాను చేయబోతున్నాడు. తాప్సీ పన్ను హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షారుఖ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టైటిల్ అనౌన్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.