శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 13, 2021 , 13:21:36

రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ.. భార‌త్ 148/3

రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ.. భార‌త్ 148/3

ఇంగ్లండ్‌తో చెపాక్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ( 101బ్యాటింగ్: 131 బంతుల్లో 14x4, 2x6) వ‌న్డే త‌ర‌హాలో ఆడి టెస్ట్ కెరీర్‌లో ఏడో శ‌తకం న‌మోదు చేశాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో రోహిత్‌కు మంచి రికార్డ్ ఉండ‌గా, దానిని కొన‌సాగించాడు. ఫాస్ట్ బౌలర్స్, స్పిన్న‌ర్స్‌ను ఉతికి ఆరేసిన రోహిత్ .. పుజ‌రా(21)తో 85 ప‌రుగుల భాగ‌స్వామ్యం న‌మోదు చేయగా, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(25)తో 58 ప‌రుగుల విలువైన భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశాడు. ఈ క్ర‌మంలో భార‌త్ రెండో సెష‌న్‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 148 ప‌రుగులు చేసింది.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ శుభమన్ గిల్ (0: 3 బంతుల్లో) రెండో ఓవర్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన చతేశ్వర్ పుజారా (21: 58 బంతుల్లో 2x4)ని స్పిన్నర్ జాక్ లీచ్ ఔట్ చేశాడు. ఇక విరాట్ కోహ్లీ (0: 5 బంతుల్లో) ఊహించ‌ని రీతిలో  మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌల‌ర్స్ లో స్టోన్, లీచ్, అలీ చెరో వికెట్ తీసుకున్నారు. 

VIDEOS

logo