MLA Kasireddy | ఎమ్మెల్యే కారు ఢీ కొని ఒకరి మృతి
MLA Kasireddy | కడ్తాల్, (తలకొండపల్లి) మే 6 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమం గా ఉన్నది. తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం... ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం తలకొండపల్లి మండలంలోని వెల్జాల్లో కార్నర్ మీటింగ్ ముగించుకొని మిడ్జిల్ మండలం వైపు బయల్దేరారు.
- మరొకరి పరిస్థితి విషమం
- ఎమ్మెల్యే కసిరెడ్డి కి స్వల్ప గాయం
- రంగారెడ్డి జిల్లాలో ఘటన
MLA Kasireddy | కడ్తాల్, (తలకొండపల్లి) మే 6 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమం గా ఉన్నది. తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం… ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం తలకొండపల్లి మండలంలోని వెల్జాల్లో కార్నర్ మీటింగ్ ముగించుకొని మిడ్జిల్ మండలం వైపు బయల్దేరారు.
ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు తలకొండపల్లి-మిడ్జిల్ రహదారిపై వెల్జాల్ శివారులోని రామాసిపల్లి మైసమ్మ ఆలయం వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొన్నది. బైక్‌పై ఉన్న తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన పబ్బతి నరేశ్(25) మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన బైరవ పరశురాములు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. కారులోని ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో ఎమ్మెల్యే, డ్రైవ ర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఎమ్మెల్యే కాలికి గాయమవడంతో కల్వకుర్తిపీహెచ్సీలో చికిత్స పొంది, అనంతరం హైదరాబాద్ బయలుదేరారు.
క్షతగాత్రుడికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
పరుశరాములును మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పరామర్శించారు. బాధితుడి భార్య మంజులకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితుడికి మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించేందుకు చేయూతనందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

