‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ ద్వితీయ సంకలనం
సీనియర్ పాత్రికేయుడు ప్రభు పుట్టినరోజుతోపాటు 40ఏండ్ల ఆయన సినీప్రయాణాన్ని పురస్కరించుకుని ఇటీవల హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
సీనియర్ పాత్రికేయుడు ప్రభు పుట్టినరోజుతోపాటు 40ఏండ్ల ఆయన సినీప్రయాణాన్ని పురస్కరించుకుని ఇటీవల హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభు రచించిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు పార్ట్ 2’ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ పుస్తకం తొలి భాగానికి గాను ఉత్తమ రచయితగా గద్దర్ అవార్డును ప్రభు అందుకున్న విషయం తెలిసిందే. అలాగే.. ప్రభు సతీమణి స్వర్గీయ ఆడెపు దుర్గామాధవి పేరిట ఓ ఛారిటబుల్ ట్రస్ట్‌ని కూడా ఈ కార్యక్రమంలోనే ప్రారంభించారు.
దర్శకులు ఎస్వీకృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు, నిర్మాతలు అచ్చిరెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, ఆదిత్యరామ్, కాట్రగడ్డ ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటులు సుమన్, జేడీ చక్రవర్తి, ఉత్తేజ్, కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, ఇంకా పలువురు సినీ మీడియా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత్రికేయుడిగా, చిత్ర పరిశ్రమలో అందరివాడిగా ప్రభు అందించిన సేవలను అతిథులంతా కొనియాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

