సీనియర్ దర్శకుడు మహేష్‌చంద్ర తాజాగా ‘పిఠాపురంలో..’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రధారులు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నది. దర్శకుడు చంద్రమహేష్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కుటుంబ భావోద్వేగాలు కలబోసిన ప్రేమకథ ఇది.
ఇందులో మూడు జంటల ప్రేమకథల్ని చూడొచ్చు. ప్రతీ ఒక్కరు ఈ కథతో కనెక్ట్ అవుతారు. పిఠాపురంలో నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కథ: ఆకుల సురేష్ పటేల్, సంగీతం: జీసీ క్రిష్, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎమ్ మురళీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌చంద్ర.