MAA Elections : మా ఎన్నికలు ఏకగ్రీవమే.. ఈసారి ఎన్నికలు ఉండవు: మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు
MAA Elections | గతంలో మా మెంబర్స్ తక్కువగా ఉండేవాళ్లని.. అప్పట్లో అంతా పద్ధతిగా ఉండేదని చెప్పాడు మురళీ మోహన్. కానీ ఇప్పుడలా లేదంటూ విమర్శించాడు. ప్రస్తుతం ఎవరికి పడితే వాళ్లకు మా సభ్యత్వం దక్కుతోందని అభిప్రాయపడ్డారు.

MAA Elections | మా ఎన్నికలు ఇంకా మొదలుకాకముందే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. సాధారణ ఎన్నికల మాదిరిగానే ప్రతిపక్షాలు, విపక్షాలు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలపై వాడీ వేడీ చర్చలు కూడా జరుగుతున్నాయి. పైగా ఈసారి ఐదుగురు నటులు మా ఎన్నికల్లో పోటీకి ఉండటంతో ఈ సారి ఎన్నికలు మంచి రసవత్తరంగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికలేమీ ఉండవని.. ఏకగ్రీవమే జరుగుతుందని చెప్పి బాంబు పేల్చారు.
గతంలో మా మెంబర్స్ తక్కువగా ఉండేవాళ్లని.. అప్పట్లో అంతా పద్ధతిగా ఉండేదని చెప్పాడు మురళీ మోహన్. కానీ ఇప్పుడలా లేదంటూ విమర్శించాడు. ప్రస్తుతం ఎవరికి పడితే వాళ్లకు మా సభ్యత్వం దక్కుతోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎవరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబరో.. ఎవరు కాదో అర్థం కావడం లేదని విమర్శించాడు. గాడి తప్పిన ‘మా’ను మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నామని.. అందులో భాగంగానే ఈ సారి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎంపిక చేసి మంచి కమిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్నామని మురళీ మోహన్ తెలిపాడు.
దీనికోసం ‘మా’లో కొన్ని విధానాలు మార్చాల్సిన అవసరం ఉందని తెలిపాడు మురళీ మోహన్. అందుకే తనతో పాటు చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ, కృష్ణంరాజు లాంటి వాళ్లమంతా కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు తెలిపాడు మురళీ మోహన్. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ‘మా’ను కుక్కలు చింపిన విస్తరి చేయొద్దని కోరాడు. ‘మా’ అధ్యక్ష పదవి అంటే హోదా మాత్రమేనని.. దాని వల్ల ఏం రాదని తెలిపాడు ఈయన. మురళీ మోహన్ మాటలు ఇప్పుడు బరిలో ఉన్న వాళ్లకు ఊహించని షాక్ అనే చెప్పాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

