స్వీయ దర్శకత్వంలో ధృవ వాయు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళింగ’. బిగ్హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 13న విడుదలకానుంది. మంగళవారం నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎంపీ రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన చాలా మంది కాంతార, విరూపాక్ష తరహాలో ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ ఇదొక కొత్త కాన్సెప్ట్. ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురిచేస్తుంది’ అన్నారు. తెరపై విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని నిర్మాతలు దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ తెలిపారు. ఈ సినిమా టీజర్ చూసి భయపడ్డానని కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన హీరో తిరువీర్ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మట్లాడారు.