Sekhar Kammula | శేఖర్ కమ్ముల ..ఈ పేరు వినగానే మనకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, మధురమైన లవ్ స్టోరీస్ గుర్తుకువస్తాయి. ఆయన సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. డాలర్ డ్రీమ్స్ నుంచి ఆనంద్, హ్యాపీ డేస్, లవ్ స్టోరీ వరకు ప్రతి చిత్రం ప్రత్యేకమైన ముద్ర వేసింది. ఇటీవల శేఖర్ కమ్ముల మరో విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందించిన ‘కుబేర’ సినిమాతో ప్రేక్షకులని పలకరించారు. శేఖర్ కమ్ముల చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకు ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఓటీటీల్లో ఇప్పటికీ ఆయన సినిమాలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
హ్యాపీ డేస్ ఆయన కెరీర్లోనే పెద్ద హిట్‌గా నిలిచి యూత్‌లో సెన్సేషన్ సృష్టించింది. నిఖిల్, వరుణ్ సందేశ్, తమన్నా వంటి నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్లలో అందుబాటులో ఉంది. అలాగే ఆనంద్ సినిమాలో రాజా, కమలినీ ముఖర్జీ జంట అద్భుతమైన కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సింపుల్‌గా, హృద్యంగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. గోదావరి సినిమాలో సుమంత్, కమలినీ జంట మ్యాజిక్ క్రియేట్ చేశారు. గోదారి అందాలు, అందమైన ప్రేమకథ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. పొలిటికల్ డ్రామా లీడర్ ద్వారా రానా దగ్గుబాటిని హీరోగా పరిచయం చేసిన శేఖర్ కమ్ముల, తన వైవిధ్యాన్ని చూపించారు. సెన్సిటివ్ సామాజిక అంశాన్ని ఆధారంగా తీసుకుని శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
ఇక రీసెంట్ మూవీ కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే శేఖర్ కమ్ముల ఎప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది లేదు.శేఖర్ కమ్ముల పెద్దగా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండరు కాబట్టి ఆయన కుటుంబ సభ్యుల గురించిన సమాచారం చాలా మందికి తెలియదు. అయితే ఆయన కూతురు ఇటీవల సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది. ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది వందన. ఇక తాజాగా తన బర్త్ డే సందర్భంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వందనాని చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకి విషెస్ చెబుతూనే శేఖర్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు.