సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్లో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. గౌతమ్ నందా కోసం సంపత్-గోపిచంద్ కలిసి పని చేశారు. ఇది నిరాశ మిగిల్చింది. కాని సీటీమార్ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో చాలా మంది కీలక నటీనటులు నటించారు. భూమిక చావ్లా, రెహమాన్, రావు రమేష్, ప్రగతి వంటి నటీనటులు కీలక పాత్రలలో నటించగా వర్మ స్కూల్ నుంచి వచ్చిన అప్సరా రాణి పెప్సీ ఆంటీ అనే ఒక సాంగ్ తో దుమ్ముదులిపేసింది. మొదటి ఆట నుంచి కూడా సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది.
సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది. రీసెంట్గా సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. అయితే తాజాగా చిత్రం లాంచ్ అయిన దగ్గర నుండి ఎండ్ వరకు షూటింగ్ ఎలా జరిగిందనేది ఒక వీడియో రూపంలో చూపించారు.ఇది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.