లక్ష్మణమూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతారాం సిత్రాలు’. డి. నాగ శశిధర్‌రెడ్డి దర్శకుడు. పి.పార్థసారధి, డి.నాగేంద్రరెడ్డి, కృష్ణచంద్ర విజయబట్టు నిర్మాతలు. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
అతిథిగా విచ్చేసిన యువహీరో ఆకాశ్ జగన్నాథ్ ట్రైలర్‌ని విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇది స్ట్రెస్ రిలీఫ్ సినిమా అని, ఆడియన్స్ రెండుగంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు.
గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా సినిమా చూస్తే అంత ప్రశాంతంగా ఉంటుందని హీరో అన్నారు. ఇంకా నిర్మాతలతో పాటు కథానాయిక భ్రమరాంబిక కూడా మాట్లాడారు.