స్వీయ దర్శకత్వంలో రమేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. లక్ష్మీకుమారి నిర్మాత. రిషిత, మేఘన కథానాయికలు. ఈ చిత్రంలోని ‘సీతాకోకై ఎగిరింది మనసే’ అనే లిరికల్ వీడియోను ఇటీవల దర్శకనిర్మాత సాయిరాజేష్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘చిత్రీకరణ పూర్తయింది.
ఈ పాటను కులుమనాలిలోని అందమైన లొకేషన్లలో తెరకెక్కించాం. విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. సంధ్య, జీవా, విజయరంగరాజు, జబర్దస్త్ అప్పారావు, రాజ్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.రమణ, సంగీతం: ఎం.ఎల్.రాజా, రచన-దర్శకత్వం: చిమటా రమేష్‌బాబు.