Sebastian P.C 524 | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ మంచి నటుడిగా సినీరంగంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్న యువ హీరో కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు’, ‘S.R.కళ్యాణమండపం’ వంటి వరుస హిట్ల తర్వాత ‘సెబాస్టియన్ పి.సి.524’ సినిమాతో ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటీవ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పోటిగా శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం ఉండటంతో ఈ చిత్ర కలెక్షన్లకు తీవ్ర దెబ్బ పడింది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ రిలీజ్‌కు సిద్దమైంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో మార్చి 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సినిమా విడుదలైన రెండు వారాలకే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. బాలాజీ సయ్యపురెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నువేక్ష హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో కిరణ్ రేచికటి ఉన్న కానిస్టేబుల్ పాత్రలో నటించాడు.