దేశ చరిత్రలో చీకటి కోణాలు.. కుంభకోణాలు! అది చిన్నదైనా, పెద్దదైనా ఎప్పుడు వాటి ప్రస్తావన వచ్చినా ‘ఇలా కోట్లు గడించారు, అలా ముంచారు’ అని ఆసక్తిగా చెప్పేవాళ్లూ, పెదవి విరిచేవాళ్లూ చాలామంది కనిపిస్తారు. ఓటీటీ రాకతో ఒకప్పుడు సంచలనం సృష్టించిన కుంభకోణాల పుట్టుపూర్వోత్తరాలు వెబ్‌సిరీస్‌ల రూపంలో ప్రేక్షకులకు తెలిసిపోతున్నాయి.
వెబ్‌సిరీస్: స్కామ్ 2003 (ద తెల్గీ స్టోరీ)
ఎప్పుడు?: సెప్టెంబర్ 2
ఎక్కడ?: సోనీలివ్
దేశ చరిత్రలో చీకటి కోణాలు.. కుంభకోణాలు! అది చిన్నదైనా, పెద్దదైనా ఎప్పుడు వాటి ప్రస్తావన వచ్చినా ‘ఇలా కోట్లు గడించారు, అలా ముంచారు’ అని ఆసక్తిగా చెప్పేవాళ్లూ, పెదవి విరిచేవాళ్లూ చాలామంది కనిపిస్తారు. ఓటీటీ రాకతో ఒకప్పుడు సంచలనం సృష్టించిన కుంభకోణాల పుట్టుపూర్వోత్తరాలు వెబ్‌సిరీస్‌ల రూపంలో ప్రేక్షకులకు తెలిసిపోతున్నాయి. అంతేకాదు, వాటి నిర్మాణ సంస్థలకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. స్టాక్‌మార్కెట్‌ను కుదిపేసిన హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా ఓటీటీకెక్కిన ‘స్కామ్ 1992’ రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంది. హర్షల్ మెహతా దీనికి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఆయన నిర్మాణ సంస్థలో తుషార్ దర్శకత్వంతో మరో స్కామ్ కథ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. వేల కోట్ల రూపాయల విలువైన నకిలీ స్టాంప్ పేపర్ల బాగోతంపై ‘స్కామ్ 2003’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కుంభకోణానికి అబ్దుల్ కరీం తెల్గీ సూత్రధారి. ఆయన ప్రధాన పాత్రగా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. గగన్ దేవ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. జర్నలిస్ట్ సంజయ్ సింగ్ అప్పట్లో నకిలీ స్టాంపుల స్కామ్‌ను వెలుగులోకి తెచ్చాడు. ఆయన రచించిన ‘రిపోర్టర్ కీ డైరీ’ ఆధారంగా దీన్ని నిర్మించారు. ‘స్కామ్ 1992’కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన రావడంతో తాజా వెబ్‌సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి స్టాంపుల కుంభకోణం కథ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి!