Sayyesha Saigal |తమిళచిత్రపరిశ్రమ (Kollywood)లో హీరోయిన్లు సాధారణంగా డైరెక్టర్లు, హీరోలను పెళ్లి చేసుకున్న తర్వాత యాక్టింగ్‌కు దూరంగా ఉంటారు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ విషయంపై శ్రద్ధ తీసుకునే హీరోయిన్లు చాలా తక్కువనే చెప్పాలి. అయితే అలాంటి హద్దులను తాను చెరిపేస్తానంటూ ముందుకొచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది ముంబై భామ సయేషా సెహగల్(Sayyesha Saigal). ఈ బ్యూటీ అఖిల్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది.
సయేషాకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో ఆర్యను సయేషా సెహెగల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ఓ కూతురు కూడా ఉంది. అయితే తాను యాక్టింగ్ విషయంలో మాత్రం తగ్గేదే అనే ఫార్ములాను అప్లై చేస్తున్నట్టు కొత్త వార్తతో అర్థమవుతోంది. శింబు నటిస్తోన్న తాజా చిత్రం (Pathu Thala). మార్చి 30న విడుదల కానుంది.
ఈ సినిమాలో రావడి ఐటెం సాంగ్‌లో మెరవనుంది సయేషా సెహగల్. ఈ సాంగ్ విజువల్స్ చూస్తే సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా బోల్డ్‌గా కనిపించేందుకు కూడా రెడీ అని చెబుతోంది. ఈ పాటలో సయేషా తన స్టన్నింగ్ డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ తో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సయేషా బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా లాంటి హీరోయిన్లను స్ఫూర్తిగా తీసుకొని మరికొంత మంది హీరోయిన్లు ఐటెం సాంగ్ చేసేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Raawadi వీడియో సాంగ్..
Shaakuntalam | సమంత శాకుంతలం 3డీ ట్రైలర్ లాంఛ్ టైం ఫిక్స్
MM Keeravani | నా మొదటి ఆస్కార్ రాంగోపాల్ వర్మ.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Orange | ఆరెంజ్ రీరిలీజ్.. అప్పుడు డిజాస్టర్ టాక్.. ఇప్పుడు ఆల్‌టైమ్ రికార్డు