Krishnamma Movie Teaser | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘కృష్ణమ్మ’ ఒకటి. ఇటీవలే ‘గాడ్సే’తో ప్రేక్షకులను నిరాశపరిచిన సత్యదేవ్ ఈ సారి కృష్ణమ్మతో ఎలాగైనా భారీ విజయం సాధించాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే మొదటి సారి పూర్తి స్థాయి యాక్షన్ కథతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను సాయిధరమ్ తేజ్ విడుదల చేశాడు.
‘ఈ కృష్ణమ్మ లాగే మేము ఎప్పుడు పుట్టామో ఎలా పుట్టామో ఎవ్వడికి తెలియదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా, పుట్టిన ప్రతి ఒకడికి ఏదో ఒక కథ ఉండే ఉంటుంది. కథ నడక, నది నడక ప్రశాంతంగా సాగిపోవాలంటే.. ఎవ్వడు గెలక్కూడదు. కానీ గెలికారు’ అంటూ సత్యదేవ్ పలికే సంభాషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సత్యదేవ్ మొదటి సారిగా ఓ మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో అంచనాలు నెలకొల్పయి. ఇక తాజాగా విడులైన టీజర్ అంచనాలను అమాంతం పెంచింది. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా అతిరా రాజీ హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నాడు.
Read Also:
Viruman Movie | ఆసక్తికరంగా ‘కార్తి’ విరుమన్ ట్రైలర్
Sitaramam Movie | భారీగా ‘సీతారామం’ థియేట్రికల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
Gargi Movie | అప్పుడే ఓటీటీలోకి సాయిపల్లవి ‘గార్గి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?