Gargi Movie | అప్పుడే ఓటీటీలోకి సాయిపల్లవి ‘గార్గి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Gargi Movie On OTT | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. ఓ ఆడియో ఫంక్షన్లో సాయిపల్లవి క్రేజ్ చూసి సుకుమార్.. ‘లేడి పవర్ స్టార్’ అనే ట్యాగ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గుడపుతుంది. ఇటీవలే ఈమె నటించిన ‘గార్గి’ విడుదలై ఘన విజయం సాధించింది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సాయిపల్లవి తన సహజ నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
‘గార్గి’ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఆగస్టు 12 నుండి తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్ విడుదలకు నాలుగు వారాలకు డిజిటల్లో విడుదలవుతుంది. ఈ మధ్య చాలా వరకు సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. ఈ క్రమంలో సాయిపల్లవి నటించిన గార్గి కేవలం వారంలోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్పీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి విడుదల చేశాడు. సాయిపల్లవి ప్రస్తుతం కోలీవుడ్‌లో శివకార్తికేయన్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

