Sitaramam Movie | భారీగా ‘సీతారామం’ థియేట్రికల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
Sitaramam Movie Theatrical Business | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ఆ అంచనాలు కాస్త రెట్టింపయ్యాయి. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తున్నారు. ఇప్పటికే పలు మేజర్ సిటీల్లో ప్రమోషన్లను జరపుతూ చిత్రబృందం సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందట.
‘సీతారామం’ చిత్రానికి దాదాపు రూ.18.70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే రూ.19.50 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రానికి ఉన్నక్రేజ్కు హిట్ టాక్ వస్తే వారంలోగానే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

