పోలీస్‌ఆఫీసర్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’. నవీన్‌చంద్ర ఇందులో అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. సుమన్ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. ఇప్పుడు మూడో పాటను కూడా ఈ నెల 15న విడుదల చేయనున్నారు.
‘వెతుకు.. వెతుకు..’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన రిలీజ్ అనౌన్స్‌మెంట్‌ను శనివారం విడుదల చేశారు. నేరస్తులను పట్టుకోవడం కోసం ‘సత్యభామ’ చేసే సెర్చింగ్ నేపథ్యంలో ఈ పాట వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.విష్ణు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సమర్పణ: శశికిరణ్ తిక్క.