సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ‘సత్య ఫిల్మ్ అకాడెమీ’ ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రాజశేఖర్, జీవిత, రచయిత విజయేంద్రప్రసాద్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ సత్య మాట్లాడుతూ..‘డాన్స్ మాస్టర్లుగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎదిగాం. ఇవాళ హైదరాబాద్లో బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు. అలాగే సినీ రంగంలోకి రావాలనుకునే చాలా మందికి సరైన శిక్షణ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి మా అకాడెమీలో శిక్షణ ఇస్తాం. కేవలం నటనలోనే కాకుండా ఫిట్నెస్, ఫైట్స్, జుంబా లాంటి అన్ని విభాగాల్లో మెరికల్లా తయారు చేస్తాం’ అన్నారు.