‘థియేటర్లకు వెళ్లి సినిమా చూశా. ప్రేక్షకుల స్పందన చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. వాళ్ల ప్రేమతో భావోద్వేగాలను ఆపుకోలేకపోయా’ అన్నారు హాస్య నటుడు సత్య. ఆయన హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘జెట్లీ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించారు. ఈ సందర్భంగా శనివారం ‘రోరింగ్ టేక్ఆఫ్’ పేరుతో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.
సరికొత్త ఐడియాతో ఈ సినిమా తీశామని, ప్రేక్షకులు కథలోని వినోదాన్ని ఎంజాయ్ చేస్తున్నారని, అన్ని కేంద్రాల్లో వసూళ్లు కూడా చాలా బాగున్నాయని నిర్మాత చెర్రీ తెలిపారు. రొటీన్‌కు భిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించామని, ఈ చిత్రం తమ అంచనాలను నిజం చేసిందని దర్శకుడు రితేష్ రానా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.