సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనంజయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జీబ్రా’. ‘లవ్ ఫేవర్స్ ది బ్రేవ్’ ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. గురువారం సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆయన ైస్టెలిష్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. లవ్, యాక్షన్, క్రైమ్ అంశాలు కలబోసిన ఎమోషనల్ డ్రామా ఇదని, సత్యదేవ్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత పేర్కొన్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో, సత్యరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్య పొన్మార్, సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: ఎస్.ఎన్.రెడ్డి, యస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం, రచన-దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్.