అగ్ర నటుడు మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించారు. జమీందారి నేపథ్యంలో ఓ పాత కోటలో కథ ప్రారంభమవుతుంది. అక్కడ ఒంటరిగా జీవిస్తుంటాడు ఓ వ్యక్తి. అతనికి అనుమానం ఎక్కువ.
నిజం, భ్రమ మధ్య నలిగిపోతుంటాడు. అతని గతంలో రహస్య ప్రేమకథ కూడా ఉంటుంది. మరో కోణంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంటుంది. ఇలాంటి అంశాలు ప్రధానంగా, సైకలాజికల్ డ్రామాగా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతున్నది.
ఇందులో హీరో సత్యదేవ్ యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు వేర్వేరు లుక్స్‌లో కనిపించారు. సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు డార్క్ హ్యూమర్‌తో టీజర్ మెప్పించింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, నిర్మాతలు: చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్చంద్ర, రచన, ఎడిటింగ్, దర్శకత్వం: వెంకటేష్ మహా.