సత్యదేవ్, డాలీ ధనుంజయ కథానాయకులుగా నటిస్తున్న తాజా చిత్రం ‘జీబ్రా’. ‘లవ్ ఫేవర్స్ ది బ్రేవ్’ ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ కథానాయికలు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆర్థిక నేరాల నేపథ్యంలో యథార్ధ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది.
తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాం’ అన్నారు. సత్యరాజ్, సునీల్, గరుడ రామ్, రామరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్య పోన్మార్, సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: ఎస్ఎస్ రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం, రచన-దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్.