Animal | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యానిమల్ (Animal). సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం యానిమల్ నుంచి Satranga (తెలుగులో NeyVeyRey) అంటూ సాగే రెండో పాటను లాంఛ్ చేశారు మేకర్స్.
సిద్దార్థ్-గరిమా రాసిన ఈ పాటను శ్రేయాస్ పురానీ కంపోజిషన్‌లో పాపులర్ సింగర్ అర్జీత్ సింగ్ పాడాడు. ఆదా తేరా ఇష్క్.. ఆదా మేరా అంటూ అర్జీత్ సింగ్ మ్యాజికల్ వాయిస్‌తో సాగుతున్న ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యానిమల్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. హీరోహీరోయిన్లపై ఎమోషనల్‌గా సాగే ఈ పాటను హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు.
తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగునున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యానిమల్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సూపర్ థ్రిల్ అందించేలా ఉండబోతుందని బీటౌన్ సర్కిల్ టాక్.
యాక్షన్, రొమాన్స్, ప్రతీకారం, డ్రామా, థ్రిల్, సంగీతం.. ఇలా ప్రతీ ఎలిమెంట్‌తో సినిమా ఫుల్ మీల్స్‌లా ఉండనుందట. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Satranga సాంగ్..
తెలుగు వెర్షన్ సాంగ్..
Satranga is yours noww🤍https://t.co/DEvMZcMcTm#Animal2ndSong #AnimalOn1stDec #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @thedeol @tripti_dimri23 @arijitsingh @singer_karthik @shreyaspuranik@KuttiKalam @IananthaSriram@EricnPillai #DurgeshRRajbhatt… pic.twitter.com/guheXsKtrE
— Rashmika Mandanna (@iamRashmika) October 27, 2023