బార్బరిక్ లాంటి పాత్రలు మరిన్ని చేయాలనుంది
‘ఓ విభిన్నమైన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్'. ఈ సినిమాకు కథే హీరో. ఇక పాత్రధారులంతా ఎవరికి వాళ్లే మెయిన్‌గా ఫీలవ్వొచ్చు. అలాంటి భిన్నమైన కాన్సెప్ట్ ఇది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను. దర్శకుడు, డీవోపీ కలిసి కెమెరా యాంగిల్స్‌తోనే సస్పెన్స్ క్రియేట్ చేశారు.
‘ఓ విభిన్నమైన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ సినిమాకు కథే హీరో. ఇక పాత్రధారులంతా ఎవరికి వాళ్లే మెయిన్‌గా ఫీలవ్వొచ్చు. అలాంటి భిన్నమైన కాన్సెప్ట్ ఇది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను. దర్శకుడు, డీవోపీ కలిసి కెమెరా యాంగిల్స్‌తోనే సస్పెన్స్ క్రియేట్ చేశారు.‘బార్బరిక్’ లాంటి మంచి పాత్రలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నా. నా మిత్రుడు చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది.’ అని అగ్ర నటుడు సత్యరాజ్ అన్నారు.
ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. వశిష్ట ఎన్.సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ముఖ్య పాత్రధారులు. మోహన్ శ్రీవత్స దర్శకుడు. అగ్ర దర్శకుడు మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ పతాకంపై విజయ్‌పాల్‌రెడ్డి అడిసెల నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో సత్యరాజ్ మాట్లాడారు. ఈ చిత్రంలో నటించినందుకు నటుడు వశిష్ట ఎన్.సింహా, నటి ఉదయభాను, సాంచీరాయ్ ఆనందం వెలిబుచ్చారు. కమిట్మెంట్తో ఈ సినిమా చేశానని, కంటెంట్ ఉన్న సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్, చైల్డ్ ఆర్టిస్టులు కార్తికేయ, మేఘన, డీవోపీ కుశేందర్ రమేశ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్, కొరియోగ్రాఫర్ ఈశ్వర్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

