సతీష్ నివాసం హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ ఆశోక’. వినోద్ వి ధోండలే దర్శకుడు. ‘కాంతార’ ఫేమ్ సప్తమిగౌడ కథానాయికగా నటిస్తున్నది. గురువారం ఈ సినిమా నుంచి ‘వినరా మా దేవ..’ అనే పాటను విడుదల చేశారు. శివుడిని స్తుతిస్తూ జాతర నేపథ్యంలో ఈ పాట వస్తుందని, పీరియాడిక్ మూవీగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు పేర్కొన్నారు. బి.సురేష్, సంపత్, మైత్రేయ, గోపాల్ కృష్ణ దేశ్పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, నిర్మాతలు: వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నివాసం, దర్శకత్వం: వినోద్ వి ధోండలే.