Rakshit Atluri | టాలీవుడ్ యువ నటుడు రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ‘శశివదనే’ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం నాడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా విజయంపై చిత్ర బృందం పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది.
సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ, మా నిర్మాత తేజ గారు ఈ కథ గురించి మూడేళ్ల క్రితం చెప్పారు. దర్శకుడు సాయి మోహన్ చెప్పిన కథ మొదట్లో నాకు అంతగా అర్థం కాలేదు, కానీ ఆయన రాసిన కొన్ని సీన్లు నచ్చాయి. ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ సీన్స్ తెలుగులో ఇంతవరకు రాలేదని నమ్మకంగా చెప్పగలను. నటుడు శ్రీమాన్ గారు చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. గోదావరి జిల్లాల అందాలను అద్భుతంగా చూపించిన కెమెరామెన్ సాయి కుమార్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమా చేశాం. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆనందంతో వస్తారు. ఈ సినిమా ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు” అని ధీమా వ్యక్తం చేశారు.
హీరోయిన్ కోమలి ప్రసాద్ మాట్లాడుతూ.. శశివదనే’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నేను పోషించిన పాత్ర కొత్తగా ఉంటుంది. మా టీంలో చాలామంది కొత్తవారే ఉన్నా అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. థియేటర్లో మా సినిమా ఖచ్చితంగా అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది” అని తెలిపారు.
నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. ఆడియెన్స్‌కి మంచి అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ సినిమా చేశాం. కంటెంట్ మీద మా అందరికీ నమ్మకం ఉంది. నాకు అనుభవం లేకపోవడం వల్లనే రిలీజ్లో కొంచెం జాప్యం జరిగింది. మా చిత్రం ట్రైలర్ అందరికీ నచ్చింది. ‘శశివదనే’ లాంటి క్లైమాక్స్‌ను తెలుగులో ఇంతవరకు చూడలేదని నేను చెప్పగలను. మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లందరికీ ధన్యవాదాలు” అని చెప్పారు.
దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి రావాలనేది మా నాన్న కల. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. రక్షిత్ గారు, కోమలి గారు అద్భుతంగా నటించారు. శ్రీమాన్ గారు చేసిన సింగిల్ షాట్ సీన్ గురించి అందరూ చెప్పుకుంటారు. అక్టోబర్ 10న వస్తున్న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అని విజ్ఞప్తి చేశారు.
కెమెరామెన్ సాయి కుమార్ దారా మాట్లాడుతూ.. ఈ సినిమా కోసమే చాలా కష్టపడ్డామని, ‘శశివదనే’ విజువల్స్ చూసిన తరువాతే తనకు మరిన్ని అవకాశాలు వచ్చాయని తెలిపారు. నటి అంబికా సహా ఇతర చిత్ర బృందం సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయం పట్ల తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నటీనటులు:
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సాయి మోహన్ ఉబ్బన
సమర్పణ: గౌరీ నాయుడు
నిర్మాతలు: అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల
సంగీతం: శరవణ వాసుదేవన్ (సంగీతం), అనుదీప్ దేవ్ (నేపథ్య సంగీతం)
కెమెరామెన్: శ్రీ సాయి కుమార్ దారా
ఎడిటర్: గ్యారీ బీహెచ్
బ్యానర్స్: ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్