Sarkaru Vaari Paata Title Song | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. మహేష్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. గీతా గోవిందం ఫేం పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొదటి నుంచి సినిమాపైన ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకుల అటెన్షన్‌ను తిప్పుకుంటుంది.
మేకర్స్ తాజాగా ట్విట్టర్లో రేపు మోత మోగిపోవాలా అంటూ శనివారం 11.07 గంటలకు చిత్ర టైటిల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ‘కళావతి’, ‘పెన్నీ’ పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. బ్యాంకింగ్ స్కామ్‌ల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు టాక్. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్ బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
రేపు మోత మోగిపోవాలా 🥁🔊#SVPTitleSong Tomorrow @ 11.07 AM 💥💥#SarkaruVaariPaata#SVPonMay12
Super🌟@urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/auYcPILZ5b
— SarkaruVaariPaata (@SVPTheFilm) April 22, 2022
Read also:
RRR Movie OTT Date | ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘ఆర్ఆర్ఆర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mahesh Babu | ‘ఆచార్య’ చిత్రం కోసం ఆ పని చేయనున్న మహేష్‌బాబు?
Jhund OTT Date | ఓటీటీలోకి అమితాబ్ లేటెస్ట్ హిట్ ‘జుండ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?