RRR Movie OTT Date | ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘ఆర్ఆర్ఆర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
RRR Movie On OTT | ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృష్య కావ్యాన్ని చూసేందుకు ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. మొట్ట మొదటి సారిగా బాలీవుడ్లో ఖాన్, కపూర్లను సైతం వెనక్కి నెట్టి బాహుబలి కలెక్షన్ల పరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఇక బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి ఎలాంటి సినిమా వస్తుందనే చర్చలు అప్పట్లో జోరుగా జరిగాయి. ఈ క్రమంలో రాజమౌళి తారక్, చెర్రీలతో ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్‌తో మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికే రాజమౌళిపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఆర్ఆర్ఆర్ అందుకుంటుందా? బాహుబలి స్థాయిలో ట్రిపుల్ ఆర్ అకట్టుకుంటుందా? అనే ప్రశ్న ప్రతి ప్రేక్షకుడి మదిలో ఉండేది.
రాజమౌళి 2018లో సినిమాను అనౌన్స్ చేశాడు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఫిబ్రవరి 25న ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైంది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. మరో సారి రాజమౌళి క్రియేటివిటీని చూసి సినీప్రముఖుల పొగడ్తలతో ముంచెత్తారు. తారక్, చరణ్‌ల నటనకు విమర్శకుల సైతం జైజైలు కొట్టారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కికన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఇప్పటివరకు 1100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఇప్పటికి ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు కొన్ని చోట్ల స్టడీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్పై ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3 నుంచి ‘జీ-5’, ‘నెట్‌ఫ్లిక్స్’ లలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ‘జీ-5’ సంస్థ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల హక్కులను భారీ ధరకు విక్రయించగా, హిందీతో పాటు విదేశి భాషల హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ కొనుగోలు చేసింది. అయితే విదేశి భాషల వెర్షన్ మాత్రం అన్ని కుదిరితే అదే రోజున లేదంటే జూన్ రెండవ వారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించగా ఆలీయాభట్, ఒలీవియా మొర్రీస్ కథానాయికలుగా నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

