ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవీ మూ వీస్ పతాకంపై రూపొ ందుతోన్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. డిసెంబర్ 20న సిని మా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని ఈ నెల 21న ఉదయం 11గంటల 12 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ఆదివారం మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
‘మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఈ కథ. పరిపూర్ణ హాస్యకథా చిత్రం ఇది. మోహనకృష్ణ అద్భుతంగా తీశారు. ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో ఈ నెల 21న టీజర్ ద్వారా పరిచయం చేయాలనుకుంటున్నాం. షూటింగ్ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా తుదిదశకు చేరుకున్నాయి.’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపా రు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్.