నటుడు ప్రియదర్శి ప్రధానపాత్రధారిగా రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటైర్టెనర్ ‘సారంగపాణి జాతకం’. రూప కొడువాయూర్ కథానాయిక. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈచిత్రం ఈ నెల 25న సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘పూర్తిస్థాయి వినోదభరితమైన సినిమా తీయాలనే నా కోరిక ఈ సినిమాతో తీరింది. ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని అందిస్తుందీ సినిమా.
తొలుత ఈ నెల 18న సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల దృష్ట్యా 25కి వాయిదా వేశాం. ఇంద్రగంటి మోహనకృష్ణ టేకింగ్, ప్రియదర్శి యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్స్. మా శ్రీదేవీ మూవీస్ సంస్థ పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టే సినిమా అవుతుంది.’ అని నమ్మకం వెలిబుచ్చారు. నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్‌కుమార్, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్.