రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సారంగాదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల యువ హీరో రాజ్‌తరుణ్ విడుదల చేశారు.
దర్శకుడు మట్లాడుతూ ‘మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే అనుబంధాలను, సంఘర్షణలను ఆవిష్కరిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఎమోషనల్ డ్రామాగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత శరత్ చంద్ర తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివచందు, యశస్విని, మెయిన్, మోహిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ స్వయంభూ, సంగీతం: ఎమ్.ఎబెనెజర్ పాల్.