రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్చంద్ర నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల నవీన్‌చంద్ర ముఖ్య అతిథిగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో జరిగే కథ ఇదని, తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య ఉండే అనుబంధాలను ఆవిష్కరిస్తుందని చెప్పారు.
సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి తెలిపారు. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో పాటు చక్కటి సందేశంతో ఈ చిత్రం ఆకట్టుకుంటుందని నిర్మాత శరత్చంద్ర చల్లపల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.