ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 11:56:25

ముంబైలో సారా, ఇబ్రహీం సైకిల్‌ రైడ్‌..ఫొటోలు వైరల్‌

ముంబైలో సారా, ఇబ్రహీం సైకిల్‌ రైడ్‌..ఫొటోలు వైరల్‌

బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం, కూతురు సారా అలీఖాన్‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ఫిట్‌నెష్‌ విషయంలో చాలా మంది యువతకు పలు సూచనలు, టిప్స్‌ ఇస్తుంటారు. ఈ ఇద్దరు స్టార్‌ కిడ్స్‌ ముంబై వీధుల్లో సైక్లింగ్‌ చేశారు. సారా బ్లాక్‌ ట్రాక్‌ ప్యాంట్స్‌కు మ్యాచ్‌ అయ్యే టీ షర్ట్‌ వేసుకుని ముంబై రోడ్లపై సైకిల్‌ రైడ్‌ చేసింది.

గ్రే టీషర్ట్‌, షార్ట్‌తో మాస్క్‌ ధరించి ఇబ్రహీం కూడా సారాతో కలిసి రైడ్‌ చేశాడు. డే అవుట్‌ సెషన్‌లో సారా, ఇబ్రహీం ముఖాలకు మాస్క్‌ పెట్టుకుని సైకిల్‌పై ఉన్న ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా..వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు సారా, ఇబ్రహీం తమ ఇంట్లో ఫిట్‌నెస్‌ వర్కవుట్స్‌ చేస్తున్న వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo